Verse 1
Reference: అనుకూల సమయమునందు నీమొరనాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని 2 కొరింథీ Corinthians 6:2
Chorus
యేసుని చెంతకు ఆశతో రమ్మిల - దోషముల్ బాపునయా‖ 2x ‖
Verse
ఇదియే మిక్కిలి అనుకూల సమయము
ఇదే రక్షణ దినము
ఇప్పుడే యేసుని యెదలో నమ్మిన
ఇదే రక్షణ దినము
Verse
పాపుల కొరకు మన ప్రభుయేసు ప్రాణము పెట్టెనయా‖ 2x ‖
మృతుడై లేచెను పరమున కేగెను ధరకే తెంచునయా‖ 2x ‖
స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా‖ 2x ‖
Verse
జపములు తపములు ఉపవాసములు - పాపముల్ బాపవయా
దానధర్మములు తీర్దయాత్రలు పాపముల్ బాపవయ్యా
యేసుని రక్తము పాపము శాపము ఇపుడే బాపునయా
Verse
యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయా
ఈ శుభవార్త ఈ జగమంత ఇపుడే చాటెదము
తరుణము దాటిన మరి ఇకరాదు - మరణము తప్పదయా