Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Chethulandhu Yesuni Rommunan

యేసుని చేతులందు యేసుని రొమ్మునన్

Yesuni Chethulandhu Yesuni Rommunan

Verse 1
Reference: అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది, కుడిచేత అతడు నన్ను కౌగలించుచున్నాడు పరమగీతము Song of Songs 2:6
Verse
యేసుని చేతులందు - యేసుని రొమ్మునన్
నాకు నభయమందు - నందె పరుండెదన్
దూతలు పాడుచుండు - పాటను వింటివా
నాయన యందుండి - పొందు సుఖంబహా!
Chorus
యేసుని చేతులందు - యేసుని రొమ్మునన్
నాకు నభయమందు - నందె పరుండెదన్
Verse
యేసుని చేతులందు మిక్కిలి క్షేమము
ఏ దుఃఖబాధలైన నచ్చోట చేరవు
పాపపు భీతి బాధలంటవు నన్నిటన్
కన్నీరు సందియంబుల్ - కొన్ని దినాళ్ళిటన్
Verse
యేసే నా యాశ్రయంబు - నాకై చావొందెగా
గొల్గోతయందు నుండు - నా గురి సర్వదా
చీకటి దాటుదాక - నోర్పుతో నుండెదన్
జేరెద నింక నాక - మంచును నమ్మెదన్

Related Tags

FaithComfortJesusProtection