Verse
యేసుని జేరఁ వేగము రా
మార్గముఁ జూపి వేదములో
దాపున నుండి క్రీస్తు దయన్
రమ్మని పిల్చును.
Chorus
సంతసంబు సంతసంబు బల్
పాపశుద్ధి మేము పొందఁగా
యేసుని యెద్దనుండ సదా
మోక్ష పథంబున‖ సంతసంబు ‖
Verse
బాలురమైన మమ్మును దా
నెంతటి ప్రేమతోఁ బిలుచున్
యేసుని స్వీకరించుటకై
వత్తుము వేగమే.
Verse
నా ముద్దు బిడ్డ రమ్మనఁగా
నాతని ప్రేమ కన్పడఁగా
నాయన నేఁడు నిన్చిలువన్
రానని యందువా?‖ సంతసంబు ‖