Chorus
యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము
దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా‖ యేసుని ‖
Verse
నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే
నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్‖ యేసుని ‖
Verse
పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము
బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను‖ యేసుని ‖
Verse
అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్
కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు‖ యేసుని ‖
Verse
శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు
లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్‖ యేసుని ‖
Verse
బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై యున్నవి ప్రభునందు అద్భుతముగ
ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంటిని‖ యేసుని ‖
Verse
అర్పించెను దన ప్రాణమునాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును
నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప‖ యేసుని ‖
Verse
ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే
దీర్చునుయిలనా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్‖ యేసుని ‖
Verse
యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి పావన
నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్‖ యేసుని ‖