Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Naama Shabdhamu Vishvaasi Cheviki

యేసుని నామ శబ్దము విశ్వాసి చెవికి

Yesuni Naama Shabdhamu Vishvaasi Cheviki

Verse
యేసుని నామ శబ్దము - విశ్వాసి చెవికి
దివ్యమై యాదరించు - భీతిని ద్రోలును
Verse
గాయపడిన ఆత్మను - క్లేశహృదయము
నాకలి బాధ నార్పును - విశ్రాంతి నిచ్చును
Verse
ఇంపైన పేరు బండయు - డాలు నాశ్రయము
ధననిధీ కృపలతో - నన్నింపుచుండును
Verse
యేసూ నా ప్రియ కాపరి - ప్రవక్త నా రాజు
ప్రభూ జీవమార్గ సత్యం - మా స్తుతి వినుము
Verse
నా హృదయము దౌర్బల్యము - తలంపు వ్యర్థము
నిన్ను నే జూచినపుడు - సరిగా పూజింతును
Verse
శ్వాసించునపుడెల్లను - నీ ప్రేమ జాటుదున్
నీ నామ మధురమే నా - మృతిన్ ఆదరించున్

Related Tags

WorshipDevotionalJesus