Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Naamamulo

యేసుని నామములో

Yesuni Naamamulo

Verse
యేసుని నామములో – మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును
శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును
హృదయములో నెమ్మదొచ్చును
యేసు రక్తముకే – యేసు నామముకే
యుగయుగములకూ మహిమే
అభిషిక్తులగు తన దాసులకు
ప్రతి సమయమునా జయమే‖ యేసుని ‖
Verse
ఘోరమైన వ్యాధులెన్నైనా
మార్పులేని వ్యసనపరులైనా
ఆర్ధికముగా లోటులెన్నున్నా
ఆశలు నిరాశలే ఐనా
ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు
పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు‖ యేసు రక్తముకే ‖
Verse
రాజువైనా యాజకుడవైనా
నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా
ఆశ్రయముగా గృహములెన్నున్నా
నిలువ నీడే నీకు లేకున్నా
శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా
నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు‖ యేసు రక్తముకే ‖

Related Tags

FaithComfortHealingVictory