Verse
యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో
నీతిమంతులయ్యెదరు - యేసుని నమ్మెడివారు
Verse
ఖర్జూరపు చెట్టువలె - మొవ్వు వేయుచుండెదరు
ఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు
Verse
లేబానోను దేవదారు - చెట్టువలె ఎదుగుదురు
ప్రభు కృపాజ్ఞానములో - ఎదుగుచు నుందురువారు
Verse
యెహోవా మందిరములో - నాటబడి యుండెదరు
సహనముతో నిలిచెదరు - కదలక స్థిరులై యుండెదరు
Verse
దేవుని యావరణములో - వర్ధిల్లుచు నుండెదరు
సేవింతురు తమ ప్రభుని - ఘనపరతురు నిరతంబు
Verse
వారు ముసలితనంబున - చిగురు పెట్టి ఫలింతురు
ప్రసిద్ధి చేతురు ప్రభుని - యథార్థవంతుడనుచు
Verse
నీటి కాలువ యోరను - నాటబడిన వారలై
మేటిసారము కలిగి - పచ్చగ నుందురు వారు
Verse
హల్లేలూయ పాటపాడి - వల్లభుని స్తుతింతురు
చల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచియుండెదరు