Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Nindhanu Bharinchi Aayana Yoddhaku Velludhamu

యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము

Yesuni Nindhanu Bharinchi Aayana Yoddhaku Velludhamu

Chorus
యేసుని నిందను భరించి
ఆయన యొద్దకు వెళ్ళుదము
Verse
సంబల్లటు టోబీయా చేయు హేళనలు
వారలు పెట్టు శ్రమల భరించి
ఆయనతో సంతోషముగ భరించి
బయలుదేరి వెళ్ళుదము
Verse
స్తెఫను చావును మదిలో దలచి
పేతురు చెఱలో నుండుట దలచి
మోసము లెన్నియో కల్గినగాని
బయలుదేరి వెళ్ళుదము
Verse
కపట సోదరుల వలన బాధలు
అపనిందలు మా కెన్నియున్న
యేసు ప్రభువునే ద్వేషించినను
బయలుదేరి వెళ్ళుదము
Verse
కర్రలతోనే మము కొట్టినను
కత్తులతో మము ఖండించినను
ప్రజల వలన బహుగా నలిగినను
బయలు దేరి వెళ్ళుదము
Verse
ఉపవాసములతో యున్ననుగాని
జాగరణములతో యున్ననుగాని
దిగంబరత్వముతో మేమున్నన్
బయలుదేరి వెళ్ళుదము
Verse
అగ్నిలో నడువ వలసిన గాని
పలువిధ శ్రమలు మా పై బడినన్
చంపబడిన గొఱ్ఱెపిల్లను జూచి
బయలుదేరి వెళ్ళుదము
Verse
నిబ్బరముగ నిలుచుందుము మేము
యెహోవాయే మా ప పక్షము జేరి
పోరాటములో జయము చేకూర్చున్
హల్లెలూయ పాడుదము

Related Tags

FaithfulnessSufferingPersecution