Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Nithyamu Sthuthiyimchedamu Bhoomi Aakaashamu Srujimchinaadu

యేసుని నిత్యము స్తుతియించెదము భూమి ఆకాశము సృజించినాడు

Yesuni Nithyamu Sthuthiyimchedamu Bhoomi Aakaashamu Srujimchinaadu

Verse
యేసుని నిత్యము స్తుతియించెదము
భూమి ఆకాశము సృజించినాడు
మనలో దేవుని సంకల్పము
యేసుని బయలు పరచుటయే
Chorus
యేసు మారడు యేసు మారడు
విశ్వమంత మారినను మాటతప్పడు
Verse
ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో
అందరిని ప్రభు నిర్ణయించెను
పొందుగ పిలిచి నీతిగా తీర్చె
సుందరముగా మహిమపర్చు
Verse
చేసెను మనలను తన రూపమున
బాసెను పాపముచే నా రూపం
యేసులో నొసగె మరల మనకు
వాసిగ కాచును పుత్రులుగా
Verse
దేవుని ప్రేమించు వారందరికి
భువిలో జరుగునన్ని మేలుకై
కావవి ఎన్నదగిన శ్రమలు
భావి మహిమతో పోల్చుటకై
Verse
శ్రమయు బాధ హింసయైనను
కరువు వస్త్రహీనతయును
ఉపద్రవమైనను ఖడ్గమైనను
ఎడబాపునే ప్రభు ప్రేమనుండి
Verse
మరణము జీవమైనను
దేవదూతలు ప్రధానులు
అధికారులు మరి ఎవరైనను
ఎడబాపరు ప్రభు ప్రేమనుండి
Verse
ఆనాది దేవుని ఆ సంకల్పం
మనలో ప్రభుని బయలుపరప
మనవలెను మన పాపములు
పూనికతో పూర్ణ ఐక్యతకు

Related Tags

PraiseWorshipJesus