Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Prema Yesu Vaartha

యేసుని ప్రేమ యేసు వార్త

Yesuni Prema Yesu Vaartha

Verse
యేసుని ప్రేమ యేసు వార్త
వాసిగ చాటను వెళ్ళెదము
ఆశతో యేసు సజీవ సాక్షులై
దిశలన్నిటను వ్యాపించెదము
వినుము ప్రభుని స్వరము‖ 2x ‖
ప్రభు యేసు సన్నిధి తోడు రాగా
కడుదూర తీరాలు చేరెదము‖ యేసుని ‖
Verse
మరణ ఛాయ లోయలలో
నాశన కూపపు లోతులలో‖ 2x ‖
చితికెను బ్రతుకులెన్నో‖ 2x ‖
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము‖ యేసుని ‖
Verse
కాపరి లేని గొర్రెలుగా
వేసారెనుగ సమూహములే‖ 2x ‖
ప్రజలను చూచెదమా‖ 2x ‖
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము‖ యేసుని ‖

Related Tags

TestimonyEvangelismMission