Verse
యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే యో మనసా
వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా‖ యేసుని ‖
Verse
పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభు నిలఁ దలఁచవె యో మనసా
శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా‖ యేసుని ‖
Verse
కష్టములలో మన కండగ నుండిన కర్తను దలఁచవె యో మనసా
నష్టములన్నియు నణఁచిన యాగురు శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా‖ యేసుని ‖
Verse
మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ దలఁచవె యో
మనసా కరుణను మన క న్నీటి దుడిచిన కర్తను పొగడవె యో
మనసా‖ యేసుని ‖
Verse
ప్రార్థనలు విని ఫలముల నొసఁగిన ప్రభు నిఁక దలఁచవె యో మనసా
వర్థనఁ గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా‖ యేసుని ‖
Verse
వంచనలేక వరముల నొసఁగిన వరదునిఁ దలఁచవె యో మనసా
కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా‖ యేసుని ‖