Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Raajyamu Adi Nishchalamainadi

యేసుని రాజ్యము అది నిశ్చలమైనది

Yesuni Raajyamu Adi Nishchalamainadi

Chorus
యేసుని రాజ్యము అది నిశ్చలమైనది‖ 2x ‖
తరతరములకు యుగయుగములకు మార్పులేనిది
పరిశుద్ధులందరు స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది‖ 2x ‖
Verse
ప్రకాశమైన రాజ్యము - పరిశుద్ధులకె స్థానము‖ 2x ‖
కన్నీరు లేని రాజ్యము - మరణము లేని రాజ్యము‖ 2x ‖
ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే‖ 2x ‖
Verse
భోజనపానము కాని ఉత్తమమైన రాజ్యము - నీతి సమాధాన రాజ్యము
సూర్యచంద్రులు లేని రాజ్యము
ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే
Verse
జయించు వారిదే రాజ్యము - నీతిమంతులదే కిరీటము
జీవజలనది పారును - దేవుడే వాటిని త్రాగనిచ్చును
ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే
Verse
శాపము లేని రాజ్యము - గొర్రెపిల్ల ఉండు రాజ్యము
మన ప్రభువే ప్రకాశించును - యుగయుగములు పరిపాలించున్
ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే
Verse
క్రీస్తుని రాక ఏ క్షణమో - ఎదుర్కొన నీవు సంసిద్ధమా
నేడే యేసుని స్వీకరించు - క్రీస్తుకై నీవు జీవించుమా
ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లపుడు సంతోషమే

Related Tags

HeavenEternityKingdom