Chorus
యేసుని సేవింప దయచేసితివి ప్రేమస్వరూప యేసుని దాసులనందరిని
దరి జేర్చుటకును వాసికెక్కి పరవాసము చేసెడి‖ యేసుని ‖
Verse
ఆదియందు భూమ్యాకాశంబుల శక్తి ఆత్మ నింపార సృజించిన‖ యేసుని ‖
Verse
శత్రువులగు జనసంఖ్యను బొడగని మిత్రుడగుచు దనమేను నొసంగిన‖ యేసుని ‖
Verse
పాపులెల్ల దనప్రాపుగోరుకొని దాపుగరండని దయచేఁ బిల్చెడి‖ యేసుని ‖
Verse
సకల శుభంబులు చక్కఁగ నిచ్చుచు సకలభక్తులను సమముగఁ జూచెడి‖ యేసుని ‖
Verse
తన్ను నమ్ముకొని యున్న దీనులకు దన్నుగ నుండెడి సన్నుతుడగుమా‖ యేసుని ‖
Verse
చక్కని గుణములు లెక్కలేక తన చక్కని యాత్మను చిక్కగఁబట్టిన‖ యేసుని ‖
Verse
లోకమంతయును లోఁబడుచుండఁగ నేక ప్రభువై యేలుచుండుమా‖ యేసుని ‖