Verse
యేసుని శిష్యులము యేగుదము
పిశాచి లోకమును కదలింతుము
Verse
గాఢనిద్రపోతులను లేపెదము
దాహము గలవారలకు సాక్ష్యమిత్తుము
వేగముగ దేశద్రిమ్మరిని పార ద్రోలుచు
త్యాగు డేసుక్రీస్తుని సిలువచే
Verse
అహంకారుల నెల్లర చేర్చెదము
మహా ముత్యములను వెదజల్లెదము
మా దుఃఖములెల్ల సహించెదము
నెచ్చెలుడు యేసుక్రీస్తుని సిలువచే
Verse
ఒక్కడేయగు తండ్రి బిడ్డలారా
చక్కగా నొక్కటిగ నుండువారలారా
ఎప్పుడును మంచి మనస్సుతో నడువుడి
మన రాజగు యేసుని సిలువచే
Verse
వచ్చు బాధలనన్ని సహించెదము
గొప్ప పాతక క్రియల రూపార్చెదము
రిక్తుడైన మన నాథుని చాటుదము
శక్తి రాజుని శాంతి సిలువచే
Verse
ప్రజల నెల్లర శిష్యుల గావింతుము
తేజో మయుడైన తండ్రిని ప్రకటింతుము
ఎల్లవారికి స్వాగత మొనరింతుము
బోధకుడు యేసుక్రీస్తుని సిలువచే
Verse
ఆది యపోస్తలుల సభను యేర్పరచి
దిట్టముగ తప్పుబోధల విడచెదము
ఎప్పుడును ఒప్పుగానే నడచెదము
గొప్పతండ్రి యేసుక్రీస్తు సిలువచే
Verse
హల్లెలూయ గీతమును మ్రోగింతుము
మేలుగల్గ దుష్టక్రియల నణచెదము
వల్లభుడు క్రీస్తు వార్తకు లోబడుచు
చల్లని నాథుడేసుని సిలువచే