Verse
యేసుని శ్రమలతోడ - ఆశతో పాలు పొందెదను
Verse
ఇతని ఓదార్పు నిజము - ఇతర ఓదార్పు వృథయే
Verse
నిందలెల్ల ఏకముగా - మహామహునిమీద బడగా
వింతగానే యోర్చుకొనెను - తండ్రి మాట నేరవేర్చెన్
Verse
దుఃఖముతో నిండియుండెన్ - ప్రక్కలోన గ్రుచ్చబడెను
రక్తితోడయోర్చుకొని వి - రక్తి మాట పల్కకుండెన్
Verse
శోకంబు చెత నేను - నాకంబు కదిలింతును
రక్తంబుధార పోసెన్ - రిక్తులమైన మనకు
Verse
సదయుని రక్తముచే - హృదయాలంకారముచే
కలుగు నాహారమిదే - ఎల్లరకు శ్రేష్టాహారం
Verse
తల్లి ప్రేమకన్న మిగుల - తన ప్రేమ చూపె మనకై
నోటి మాటతోడ శత్రున్ - కోటల నశింపజేసెన్
Verse
నా యేసు రక్తచెమట - నాయప్పు యంతయున్ తీర్చెన్
ఎల్లరికి నగీకారమిదే - ఎల్లప్పుడు నా ధ్యానమున్
Verse
హల్లెలూయా గీతమును - ఎల్లపుడు చాటుచుందున్
ఎల్లరియందు తానే - ఎల్లప్పుడు వసించున్