Chorus
యేసుని స్తుతించువారు – నిత్య జీవము నొందెదరు
ఆనందముతో అనుదినము – సంతోషముతో నుందురు
ఆహా హల్లెలూయా-ఆహా హల్లెలూయా‖ 2x ‖
Verse
వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరు
జీవజలపునది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరు‖ ఆహా ‖
Verse
చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకు
చేయి విడువడక తనతో కూడ – యేసే నడిపించును‖ ఆహా ‖
Verse
చీకు చింతలు కలిగిననూ – చెరలో దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును‖ ఆహా ‖
Verse
నడి సంద్రములో పయనించినా – నట్టడవులలో నివసించినా
ఎన్నడు విడువక మరువకను యేసే తోడుండును‖ ఆహా ‖