Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Sveekarinchu Kreesthesuni Sveekarinchu

యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు

Yesuni Sveekarinchu Kreesthesuni Sveekarinchu

Verse 1
Reference: తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను John 1:12
Chorus
యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు
నీ హృదయపు ద్వారము తెరువుము
త్వరితము తానే ప్రవేశించును
Verse
కనికరమందైశ్వరుండు - నిను - వాత్సల్యముతో విమోచించును
భయంకరమైన పాపమునుండి - విడిపింప నిన్ను వెదకివచ్చెన్
Verse
మన్నించు సర్వ పాపములన్ - తానే మాన్పును సర్వరోగములన్
కృప కనికరముల మకుటము నీకు - ధరియింప జేసి ఘనపరచున్
Verse
అంధులకు దృష్టి కలుగజేసె - అంగ హీనులను లేపి నడువజేసెన్
పలు విధములగు వ్యాధి గ్రస్తులకు - స్వస్థత నిచ్చెను తక్షణమే
Verse
పాపపు భారము భరియించెను - నీ రోగములన్నిటి తొలగించన్
సహించెను కొరడా దెబ్బల బాధను - జయించెను అన్ని శోధనలన్
Verse
కలువరి సిలువలో ప్రేలాడి - తన రక్తము చిందించె ధారలుగ
చేతులలో తన కాళ్ళలో చీలలు - ముండ్ల కిరీటము ధరియించె
Verse
జీవమిచ్చుటకు ప్రాణమిడె - మరి జయించెను ప్రతివిధ శోధనలు
నీ కొరకై మరణించి లేచెను - శక్తిమంతుడే నిను రక్షింప

Related Tags

InvitationGospelSalvation