Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Thiru Hrudayama

యేసుని తిరు హృదయమా

Yesuni Thiru Hrudayama

Lyricist: P Prakash Reddy
Verse
యేసుని తిరు హృదయమా
నన్ను రక్షించు నా దైవమా‖ 2x ‖
స్నేహితుని వోలె ఆదరించావు
బోధకుడై నన్ను మందలించావు‖ 2x యేసుని ‖
Verse
కష్టములొ నన్ను నీ రెక్కల దాచావు
దుఃఖంలో నా కన్నీరు తుడిచావు‖ 2x ‖
ఏ విధమున నిన్ను నే పొగడగలను‖ 2x ‖
నీ ఋణమును నేనెలా తీర్చగలను
నా తండ్రి నా దేవా‖ యేసుని ‖
Verse
నను కాచి కాపాడే నా మంచి కాపరివి
నాకింక భయమేల నీ అండదండలలో‖ 2x ‖
జీవించెద నీ బిడ్డగ ఏ చింత లేక‖ 2x ‖
నీ ఆత్మతో దీవించు నా యేసు
నా తండ్రి నా దేవా‖ యేసుని ‖

Related Tags

WorshipDevotionalComfort