Chorus
యేసుని వెంట నేను - వెంబడించుచున్నాను‖ 1x ‖
నా సిలువను మోయుచు నేను - వెంబడించుచున్నాను‖ 1x ‖
Pre-Chorus
తన హృదయానుసారునిగా
ఉండుటకు సిద్ధపడుచున్నాను
Verse
ఎంతో అద్భుతమైనది - నా ప్రభుని బలియాగం‖ 2x ‖
సాదృశ్యముగ నా కొరకై
ప్రాణమర్పించెను - ప్రాణమర్పించెను
నా ప్రభుని తలచుచు నేను - వెంబడించుచున్నాను‖ 2x ‖
Verse
ఈ లోక సౌదర్యము - నన్ను మోసగించదు
సాతాను యుక్తులన్నియు
నా మీద పనిచేయవు - నా మీద పనిచేయవు
యేసుని స్వరము వినుచూ - వెంబడించుచున్నాను
Verse
ఎంతో అద్భుతమైనది - నా ప్రభు నన్ను శిక్షించుట
ప్రభు నన్ను సరిచేయుట
తన ప్రేమయై యున్నది - తన ప్రేమయై యున్నది
యేసుని స్వరము వినుచూ - వెంబడించుచున్నాను
Verse
ఇబ్బందులెన్నో కలిగిన నా దృష్టి ప్రభు మీదనే
శ్రమలే మాత్రము కదల్చవు
అద్దరి అగుపడుచున్నది - అద్దరి అగుపడుచున్నది
శీఘ్రముగానే చేరుటకు - వెంబడించుచున్నాను
Verse
తన చిత్తములో నన్నుంచి - నా ప్రభు సంతోషించును
మంచి మాటలన్నియు నేర్పి
నను సిద్ధపరచుచున్నాడు - నను సిద్ధపరచుచున్నాడు
మహిమను పొందుటకు నేను - వెంబడించుచున్నాను