Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesunu Choochuta Yennatiko Para Vaasu

యేసును చూచుట యెన్నటికో పర వాసు

Yesunu Choochuta Yennatiko Para Vaasu

Chorus
యేసును చూచుట యెన్నటికో పర వాసుఁడ నగుట యెన్నటికో
భాసురముగ నా పరమ జనకు సిం హాసనమున దూ తాదుల మధ్యను‖ యేసును ‖
Verse
బలితంబగు పైశాచక బంధన పాశము వదులుట యెన్నటికో సలలి
తముగ నా సద్గురు పాద స్థలమున కరఁగుట యెన్నటికో‖ యేసును ‖
Verse
ధాత్రిఁ గష్ట దుఃఖాబ్ధిని మన మిఁక ధాటిగ దాఁటుట యెన్నటికో
మైత్రితోడఁ బర మాత్ముని చెంతను మనసు తీర మను టెన్నటికో‖ యేసును ‖
Verse
కాంచనమకుటము కనకపు వీణెయు ఘనముగఁ దాల్చుట యెన్న టికో
యంచితముగ హలె లూయా పాటల నానందించుట యెన్నటికో‖ యేసును ‖
Verse
శోధన బాధల నీ ధరఁ బొందక శోకము గెల్చుట యెన్నటికో సాధూత్తమ
జన సాంగత్యమ్మున సంతస మొందుట యెన్నటికో‖ యేసును ‖
Verse
నీతి రహిత పైశాచిక భటగణ నిందలు బాయుట యెన్నటికో ఖ్యాతిగ
శ్రీ పర మాత్ముని కొలువున గట్టిగఁ గుదురుట యెన్నటికో‖ యేసును ‖
Verse
జరయు వ్యాధి సంశోక మరణములు జొరని చోటుండుట యెన్న టికో
పరిశుద్ధతయును బరమానందము ప్రబలు పదము జేరు టెన్నటికో‖ యేసును ‖

Related Tags

HeavenEternityLonging