Verse
యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు
ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు
Verse
వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు
జీవజలపు నదియొడ్దునా - వృక్షమువలె పెరిగెదరు
ఆ..హ... హల్లెలూయా - ఆ ..ఆ..ఆ.హల్లెలూయా‖ యేసు ‖
Verse
చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును
ఆ..హ..హల్లెలూయ - ఆ..ఆ...ఆ...హల్లెలూయా‖ యేసు ‖
Verse
నడి సముద్రములో పయినించినా - నట్టడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును
ఆ....హ.. హల్లేలూయా - ఆ...ఆ...ఆ..హల్లేలూయ‖ యేసు ‖