Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuprabhukai Saakshulevarevaro Ev

యేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్

Yesuprabhukai Saakshulevarevaro Ev

Lyricist: Chetti Bhanumurthy
Chorus
యేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్వరెవ్వరో యని యాశతో ప్రభు
వడుగుచున్నాడు యేసు కొరకై నిల్చి క్రైస్తవ యువకులెల్లరు సాక్ష్యమిచ్చుచు
భాసురంబుగ క్రీస్తు నెంతో భారతీయులు ప్రస్తుతించరో‖ యేసు ‖
Verse
దేవదర్శన మొంది లేలెండి ధనజనులకెల్లను దైవ ప్రేమను గూర్చి
దెలుపండీ పావనుండగు ప్రభుని బోధలు పాడి రక్షణ మార్గమెల్లను
సావధానముతోడ దెల్పరే సౌలు మారి పౌలెటాయెనో‖ యేసు ‖
Verse
రాయబారుల మంచు నమ్మండి రారాజు వార్తలు రేయిబవలును
దెలుప లేలెండీ పాయకుండగ యేసు తన విమ లాత్మ నెప్పుడు తోడ
నుంచును పాపులెల్లరు యేసు ప్రభుని పాదములు సేవించి బ్రతుకగ‖ యేసు ‖
Verse
థీరులై శుభవార్త జాటండీ దినదినము వాక్య ప్రచారమెల్లను చేయ
లేలెండీ చేయవలసిన దెల్ల ప్రభువే చేయు మీతో నాత్మరూపున
జయము మీదను జయమునిచ్చి జగతిని దగ వెలుగ జేయగ‖ యేసు ‖
Verse
పౌలు మాదిరి బోలి లేలెండీ పరలోక రాజ్య ప్రచారమెల్లను జేయలేలెండీ
పలువిధంబుల శ్రమలకోర్చి ప్రభువు శత్రుల నెల్ల మాడ్చి సిలువ
ధ్వజమును చేతబట్టి సుస్థిరంబగు సేవ జేయగ‖ యేసు ‖

Related Tags

GospelYouthServiceWitness