Verse 1
ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు హెబ్రీ Hebrews 6:19
Chorus
యేసుప్రభువే మహిమ నిరీక్షణ మనలో వున్నాడు
జయధ్వనులతో హర్షించెదము ప్రభువే నిరీక్షణ
Verse
ఈ నిరీక్షణచే రక్షణకలిగె విడిపించెను మనల
జీవపు నిరీక్షణ మనకిచ్చుటకు క్రొత్తజన్మను నొసగె
Verse
మనలనెంతో ప్రేమించి ప్రభువు శుభనిరీక్షణ నిచ్చె
అనంతకాల దయను జూపి ఆయనే స్థిరపరచెన్
Verse
క్రీస్తేసే మనకు సర్వాధికారి మనమాయన గృహము
అంతమువరకు స్థిరముగ నిలిచి మనమానందింతుము
Verse
ఈ నిరీక్షణను కలిగినవారే శుద్ధిపరచుకొందురు
సరిజేసికొనుడి ఆయనతో కూడ సమానులగునట్లు
Verse
ప్రభువుయిచ్చిన ఈ నిరీక్షణ లంగరువంటిది
నిశ్చలముగా స్థిరముగ మిమ్ము ప్రభుచెంత చేర్చునుగా
Verse
ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొనిపోవును
శుభప్రదనిరీక్షణ కలిగిన మనము ఎదురుచూచెదము