Chorus
యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము భాసురముగ తన
మహిమ చూడగా జేసెను ఆ దినము‖ యేసు ‖
Verse
భారవాహక గార్ధభమెక్కి బాహాటముగాను బయలుదేరెను జేజేలనగా
ప్రియమొప్పగతాను‖ యేసు ‖
Verse
గట్గి పాడుచు గంతులు వేయుచు అట్టహాసముతో కొట్టుచు
కరతాళములను పెద్దగా కూరిమి చూపిరిగా‖ యేసు ‖
Verse
పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు ఉల్లాసముతోను చల్లని ప్రభువని
జయములు గొట్టిరి సంతోషముతోను‖ యేసు ‖
Verse
కొందరు మూర్ఖులు తొందర చేయుచు ముందుకు వచ్చిరిగా అందరు
మానిన అరచును రాళ్లని అపుడా ప్రభువనగా‖ యేసు ‖
Verse
చిగురుటాకు చెట్ల కొమ్మలను సొగసుగ మార్గములో బాగుగ పరిరచిరి
భక్తిని చూపిరి సాగుచు జనులంతా‖ యేసు ‖
Verse
యెరూషలేము గతిగని ప్రభువు ఏడ్చెను ఎలుగెత్తి మరియు యెరుషలేం
దేవాలయమును పరిశుభ్రత చేసె‖ యేసు ‖
Verse
మనలోనున్న పాపము లెల్ల మనుపును ఆ ప్రభువే ఘనకృపశాంతులు
గల్గించియు మరి ననయము బ్రోచునిలన్‖ యేసు ‖