Chorus
యేసురాజు నీదు ప్రేమ నెంచ తరముగాదయా దోషియైన నన్ను బ్రోవ
నీసుప్రాణమిడితివా‖ యేసురాజా ‖
Verse
మంచివాని కొరకు నొకఁడు మరణ మొందుటరుదుగా అంచితమగు
ప్రేమ చేత మించి గాయము లొందినా‖ యేసు ‖
Verse
చెయ్యరాని దుష్కర్మములుఁ చేసి నే చెడియుండగా అయ్యో మ్రానుమీఁ
దికీవు ఇయ్యకొని మోసితివా‖ యేసు ‖
Verse
గెత్సేమనె వనములోకిఁ జొచ్చి తండ్రికి చిత్తమై యిచ్చిన నా శ్రమలపాత్రన్
బుచ్చుకొని భరించినా‖ యేసు ‖
Verse
హస్తము,పాదము,ప్రక్కలు మస్తకపు గాయములలో విస్తరించి చిందె నీ
ప్ర శస్త రక్తమంతయున్‖ యేసు ‖
Verse
కొండమీద నిన్నుఁజూడ గుండెలదిరిపోవునే నిండు ప్రేమ చేత నావగు
మెండుబాధల నోర్చినా‖ యేసురాజా ‖
Verse
మరువలేను నీదు ప్రేమ మరణపరియంతంబు నా నరక బాధలన్ని
నీవా కొరతపై వహించినా‖ యేసురాజా ‖
Verse
నిన్నుదలఁచ నా నిరీక్షణ యున్నతము గానుండును యెన్నడు నీ
మహిమను నా కన్నులారఁజూతునో‖ యేసురాజా ‖