Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuraaju Vachchunu Dhoothalathoa Vachchunu

యేసురాజు వచ్చును దూతలతో వచ్చును

Yesuraaju Vachchunu Dhoothalathoa Vachchunu

Verse
యేసురాజు వచ్చును దూతలతో వచ్చును
దాసుల పరమున జేర్చుటకు
యేసుని ముఖజ్యోతిని జూచెదము
జయ ధ్వనులచే నుప్పొంగెదము
Verse
సంఘ వధువు పెండ్లి కుమారుండేసుతో
మంగళ గీతము పాడును
నాడు మహిమలో మనము పాడెదము
యేసు స్నేహంపు లోతును రుచియింతుము
Verse
ముద్ర నొంది శుద్ధులు తెల్ల నంగి ధరించి
శుద్ధుని ముంగిట నిలిచెదరు నాడు
స్వర్ణ కిరీటమును దాల్చి
అందు పాడుచు ప్రకాశించెదము
Verse
యేసునే ప్రేమించితి
లోక స్నేహం వీడితి
సదా నా యేసుతో ముచ్చటింతున్
నాడు ప్రభు యేసునితో సుఖ మొందెదన్
Verse
పరలోక బూరధ్వని మ్రోగగానే
పరిశుద్ధులెగిరి వెళ్ళెదరు - ఆ
సత్యుని కల్యాణ విందులో
మన మేసుతో నార్భటించెదము

Related Tags

Second ComingRaptureJesus Return