Verse
పాపమునకు జీతము మరణము‖ 3x ‖
ఓ పాపి భయపడవా?
చూచునదెల్ల నశించు నిశ్చయము‖ 3x చూడనిదే నిత్యము ‖
Chorus
యేసురాజువచ్చును ఇంక కొంతకాలమే - మోక్షమందు చేరుదుము
Verse
లోకసుఖము నమ్మకు నమ్మకు‖ 3x ‖
ఆ యిచ్ఛలు మాయమగు
నీ జీవముపోవు సమయమున‖ 3x చిల్లిగవ్వ వెంటరాదు ‖
Verse
నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది‖ 3x ‖
లోకమాయలయందున
దైవకోపము వచ్చుటకు ముందు‖ 3x ‖
నీ రక్షకుని చేరుము
Verse
దైవ ప్రేమ పారుచున్నది‖ 3x ‖
కల్వరిగిరి మీదనుండి
నీ పాపమెల్ల అందుపోవును‖ 3x స్నానంబుచేసినన్ ‖
Verse
మహా పాపినైన నన్నును‖ 3x ‖
నా మిత్రుడంగీకరించెన్
ఓ పాపి నీవు పరుగిడి రా‖ 3x ‖
దేవ దీవెనల పొందుము
Verse
కష్టదుఃఖము లెక్కువగుచో‖ 3x ‖
ఇష్టుడేసుని వీడను
సిగ్గులేక చేరుదు నాయనచెంత‖ 3x నెప్పుడు వసింతును ‖