Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuraju Puttinadule Halleluya Padeddhama

యేసురాజు పుట్టినాడులే హల్లెలూయా పాడేద్దామా

Yesuraju Puttinadule Halleluya Padeddhama

Lyricist: K Y Ratnam
Verse
యేసురాజు పుట్టినాడులే హల్లెలూయా పాడేద్దామా
రక్షకుడు పుట్టినాడులే ఊరంతా చాటేద్దామా
ఆకాశమందు దూతల వలె మహిమోన్నతుని స్తుతియించెదం
మహిమను విడచి ఉదయించిన యేసురాజుని స్వాగతించేదం
పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు వేయుచున్నది నా హృదయం
Verse
దేవుని ప్రేమకు దూరమై లోకమంతా శాపమవ్వగా
కరుణను విడచి కర్కశమైన హృదయంతో ఈ లోకముండగా
నీ ప్రేమను పంచుటకు ఇలా వచ్చావా కరుణించి మమ్ములను క్షమియించావా
పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు వేయుచున్నది నా హృదయం
Verse
దేవుడవై దీనునిగానే పశువుల పాకలో పవళించినావా
నా నేరమునే భరియించుటకు సిలువను నీవు కోరుకున్నావా
నీ జీవమునిచ్చుటకు ఇలా వచ్చావా నీ రక్తము కార్చి మమ్ము రక్షించావా
పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు వేయుచున్నది నా హృదయం

Related Tags

PraiseWorshipChristmas