Verse
యేసుతో ఠీవిగాను పోదమా
అడ్డుగా వచ్చు వైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదము‖ యేసుతో ‖
Verse
రారాజు సైన్యమందు చేరను
ఆ రాజు దివ్య సేవ చేయను‖ 2x ‖
యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా‖ 2x ‖
యేసుతో ఠీవిగాను వెడలను‖ యేసుతో ‖
Verse
విశ్వాస కవచమును ధరించుచు
ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు‖ 2x ‖
అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై‖ 2x ‖
యేసుతో ఠీవిగాను వెడలను‖ యేసుతో ‖
Verse
శోధనలు మనల చుట్టి వచ్చినా
సాతాను అంబులెన్ని తగిలినా‖ 2x ‖
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము‖ 2x ‖
యేసుతో ఠీవిగాను వెడలను‖ యేసుతో ‖
Verse
ఓ యువతి యువకులారా చేరుడి
శ్రీ యేసురాజు వార్త చాటుడి‖ 2x ‖
లోకమంత ఏకమై యేసునాథు గొల్వను‖ 2x ‖
సాధనంబెవరు నీవు నేనెగా‖ యేసుతో ‖