Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesutho Theevigaanu Adduga Vachuvairi Gelvanu

యేసుతో ఠీవిగాను అడ్డుగా వచ్చువైరి గెల్వను

Yesutho Theevigaanu Adduga Vachuvairi Gelvanu

Verse
పల్లవి:
యేసుతో ఠీవిగాను - అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధ నాదంబుతో బోదము
...యేసుతో...
Verse
రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్యసేవ చేయను (2x)‖ 2x ‖
యేసు రాజు ముందుగా - ధ్వజము బట్టి నడువగా (2x)‖ 2x ‖
...యేసుతో...
యేసుతో ఠీవిగాను వెడలను
Verse
విశ్వాస కవచమున్ ధరించుచు - రారాజు నాజ్ఞ మదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని - బొందుచున్న వారమై
అపాయం రాకుండ కాపాడువాడవు - నిను నేను ఆరాధింతున్
...యేసుతో...
Verse
శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా
భయములేదు మనకిక - ప్రభువు చెంత నుందుము
యేసుతో ఠీవిగాను వెడలను
...యేసుతో...
Verse
ఓ యువతి యువకులార చేరుడీ - శ్రీ యేసురాజు వార్త చాటుడి
లోకమంత ఏకమై - యేసునాధు గెల్వను
సాధనంబేవరు నీవు నేనెగా
...యేసుతో...

Related Tags

VictoryYouthWarfare