Chorus
యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో
బోదము‖ యేసుతో ‖
Verse
రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవచేయను యేసు రాజు
ముందుగా ధ్వజము బట్టి నడువగా యేసుతో ఠీవిగాను వెడలను‖ యేసుతో ‖
Verse
విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై యేసుతో ఠీవిగాను వెడలను‖ యేసుతో ‖
Verse
శోధనలు మనల చుట్టివచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము యేసుతో ఠీవిగాను
వెడలను‖ యేసుతో ‖
Verse
ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత
యేకమై యేసునాధు గొల్వను సాధనంబెవరు నీవు నేనెగా‖ యేసుతో ‖