Chorus
యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా
వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా‖ యేసువ ‖
Verse
మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగఁ బాడగ యో ప్రభువా
అట్టహాసముతో అశ్వము నెక్కడ అణఁకువఁ గార్దభ మెక్కిన ప్రభువా‖ యేసువ ‖
Verse
పిల్లలు పెద్దలు పలుకేకలతోఁ బలికి నుతించగ యో ప్రభువా చల్లగ
వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా‖ యేసువ ‖
Verse
కొందరు వారిని తొందరఁ జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా
అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా‖ యేసువ ‖
Verse
యెరుషలేం కొరకై యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా
యెరుషలేమందున యాలయ మంతను శుభ్రపరచిన యో ప్రభువా‖ యేసువ ‖
Verse
మా కొఱకై తన ప్రాణము బెట్టిన మాన్యుడవీవె యో ప్రభువా మా
కొరకై ధర మరణము గెల్చిన మహిమ స్వరూపుడ యో ప్రభువా‖ యేసువ ‖
Verse
మాదు మనస్సును హృదయము నాత్మను నీదిగ గైకొను మో ప్రభువా
సాదర వాక్కులు చక్కఁగఁ బలికియు నాదరించుమము నో ప్రభువా‖ యేసువ ‖