Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuvale Ila Nenundedhanu Yesuvalena

యేసువలె ఇల నేనుండెదను యేసువలెన

Yesuvale Ila Nenundedhanu Yesuvalena

Lyricist: Pi Vijaya Charles
Chorus
యేసువలె ఇల నేనుండెదను యేసువలెను‖ యేసువలెను ‖
Verse
శుద్ధుడనై బ్రతుకు బద్ధుడనంచును శుద్ధుడనై యుండ శ్రద్ధ జూపుదు
నేను‖ యేసువలెను ‖
Verse
భరియింపవలసిన భారంబుల్గల వెన్నొ భరియింప మిక్కిలి బలశాలినై
నేను‖ యేసువలెను ‖
Verse
సాధింపవలెనెన్నొ సాహసకార్యంబుల్ సాధింపధైర్యాన సాగి పోవుదు
నేను‖ యేసువలెను ‖
Verse
ధాత్రి నెల్లతోడ మైత్రినేనెరపుచు శత్రులకునుగూడ మిత్రు డనై
నేను‖ యేసువలెను ‖
Verse
ఒరుల చింతలదీర్తు నుల్లాసమున గూర్తు పరమ ప్రేమతో నెపుడు
పైకి జూతును నేను‖ యేసువలెను ‖
Verse
నా దివ్యజనకుడు నాకు ననుదినమును బోధింప వాక్యంబు బుద్ధితో
నేర్తును‖ యేసువలెను ‖
Verse
వినిసంతసంబున ఘనుని యాజ్ఞలనెల్ల వెనువెంట జేసెద వినయంబున
నేను‖ యేసువలెను ‖

Related Tags

Christian LifeDevotionImitation