Chorus
యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న
భాసురముగ నిజ భక్తుల కది యను భవ గోచర మెపు డగు నన్న‖ యేసు ‖
Verse
ఊరు పేరు పరువులు మురువులు మరి యూడఁగొట్టబడినను గాని
కూరిమితో క్రీస్తుడు మాకుండినఁ కొదువరాదు గొప్పయు పోదు‖ యేసు ‖
Verse
ఆడికలు తిరస్కారంబులు మా కవమానము లున్నన్ గాని తోడు
క్రీస్తుఁడు మాకుండినను త్రోవఁ దప్పము ఓడిపోము‖ యేసు ‖
Verse
తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీఁదను వ్రాలినగాని దగ్గర మా
పాలిటఁ ప్రభువుండగ సిగ్గును బొందుము తగ్గునఁ కుందము‖ యేసు ‖
Verse
ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలఁ జుట్టిన యపుడు కన్న
తండ్రివలె నోదార్చుచుఁ దన ఘన వాగ్బలమున దునుమును వానిని‖ యేసు ‖
Verse
మనసు క్రుంగి పలు చింతలచేత మట్టఁబడిన వేళను మాకుఁ తన
వాగ్దత్తములను జేతుల లే వనెత్తి యెంతో సంతస మొసఁగును‖ యేసు ‖
Verse
తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలఁ డెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి
పిలిచిన వేళ నోహో యనుచు దరికి వచ్చు‖ యేసు ‖
Verse
అతఁ డుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షతినాతఁ
డు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము‖ యేసు ‖