Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yevaru Choopinchaleni ilalo nanu veediponi

ఎవరు చూపించలేనీ ఇలలో నను వీడిపోనీ

Yevaru Choopinchaleni ilalo nanu veediponi

Lyricist: Joshua Shaik
Verse
ఎవరు చూపించలేనీ – ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ – ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా
Verse
తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక – నీకొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా – యేసయ్య నీవెగా
Verse
ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం
నీ సన్నిథానమందు – సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య

Related Tags

WorshipDevotionalJesus