Verse
యోర్దాన్నది దరిని భ్రమింపకు మనసా
యోచనచే చింతపడకు నా డెందమా
Verse
ప్రవాహ మెక్కిన శక్తిని వీడకు
దివ్య ప్రభునివాక్కు మారదెన్నడు
Verse
వాక్యానుసారము పాదము పెట్టుము
ఏక దేవుడేసు మాటతప్పడు
Verse
ఉన్నతరాజగు యేసు నీ దళకర్త
అన్ని శ్రమల నుండి కాచు నిక్కము
Verse
కానాను చెంతను ప్రియుని రాజ్యము
కాంచెద దేశంబు నిత్యానందము
Verse
ప్రేమ పాల్ తేనెయు పారెడి దేశము
పాటచే దాని వర్ణింప వీల్పడదు
Verse
ప్రార్థన శక్తిచే విజయుల రాజ్యము
ప్రకాశ వస్త్రముల ధరింతు మచ్చట