Chorus
యోగ్యుడవో - యోగ్యుడవో యేసు ప్రభో నీవె యోగ్యుడవో
మరణము గెల్చిన యొధుడవో - మా జీవితముల పూజ్యుడవో
Verse
సృష్టికర్తవు నిర్మాణకుడవు - జీవనదాత జీవించువాడా‖ 2x ‖
శిరమును వంచి కరములు జోడించి - స్తుతియించెద నిన్ను యేసు ప్రభో‖ 2x ‖
...యోగ్యుడవో...‖ యోగ్యుడవో ‖
Verse
గొఱ్ఱెపిల్లవై యాగమైతివి - సిలువయందే పాపమైతివి‖ 2x ‖
శిరమును వంచి కరములు జోడించి - సేవించెద నిన్ను యేసు ప్రభో‖ 2x ‖
...యోగ్యుడవో...‖ యోగ్యుడవో ‖
Verse
స్నేహితడవై నీవిల కోరితివి - విడువకన్నుఆదుకొంటివి‖ 2x ‖
శిరమును వంచి కరములు జోడించి - భజియించెద నిన్ను యేసు ప్రభో‖ 2x ‖
...యోగ్యుడవో...‖ యోగ్యుడవో ‖