Verse
యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
ఇశ్రాయేలులో తన నామము గొప్పది
Verse
షాలేములో తన గుడారమున్నది
సీయోనులో తన ఆలయమున్నది
Verse
అక్కడ వింటి అగ్ని బాణములను
తాను అక్కడి కేడెముల కత్తులను
అక్కడ యుద్ధ ఆయుధములను
తాను అక్కడి వాటిని విరుగగొట్టెను
దుష్ట మృగములను పర్వతముల యందము
కన్నను నీవెంతో తేజోమయుడవు
Verse
కఠినహృదయులు దోచుకొనబడి
వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు
పరాక్రమశాలు లందరిని - వారి
బాహు బలమును హరించెను
యాకోబు దేవా నీదు గద్దింపునకు
రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను
Verse
నీవు భయంకరుడవు దేవా - నీవు
కోపపడు వేళ నిల్చువాడెవడు?
ఆకాశము నుండి తీర్పు వినబడెను
నీవు దేశంబులో శ్రమనొందు వారిని
రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు
భూమి భయమునొంది ఊరకయుండును
Verse
నరుల కోపము నిన్ను స్తుతించును
వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు
మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి
తన చుట్టు కానుకలు అర్పించవలెను
అధికారుల గర్వమణచి వేయువాడు
భూరాజులకు ఆయన భీకరుడు