Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yuddha Veeruda Kadulumunduku Paalu Thene

యుద్ధ వీరుడా కదులుముందుకు పాలు తేనె

Yuddha Veeruda Kadulumunduku Paalu Thene

Chorus
యుద్ధ వీరుడా కదులుముందుకు పాలు తేనెల నగరకు
వెట్టిచాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు
లేదు మనకిక అపజయం యేసు రక్తమె మన జయం
హల్లెలూయ ! హొసన్న ! (3) మనదే విజయం‖ 3x ‖
Verse
ఏదేమైన గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము
ఎర్రసంద్రమైన యెరికో గోడలైన మేం వెనుకడుగు వేయము
యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుతాం
అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతాం
Verse
పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై ప్రభువు తోడుండగా
చింతయే లేదుఏ కొదువ లేదు నిస్సత్తువే రాదుగా
ఆకలి తీర్చి మన్నా కురియును యేసుని నీడలో
దాహము తీర్చ బండయే చీలెను కలువరి సిలువలో
Verse
గొర్రెపిల్ల రక్తం దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం
శక్తిచేత కాదు బలము చేత కాదు ప్రభు ఆత్మతో గెలిచెదం
యేసుని గొప్ప వాగ్ధానములే నింపెను నిబ్బరం
యేసుని యందు వశ్వాసమె మా విజయపు సూచకం

Related Tags

FaithSpiritual WarfareVictoryWarrior