Verse
యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం
మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం
భయపడము జడియము
అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం
Verse
కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము
పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు
బలహీనతలో - మనము బలవంతులమయ్యాము
శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా‖ యుద్ధ ‖
Verse
విస్వాసమనే డాలు చేతితో పట్టుకొని
మహిమ శిరస్త్రాణమును - యేసువలన పొందాము
సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము
స్వీకృత పుత్రాత్మయే - జయం మనకు ఇవ్వగా‖ యుద్ధ ‖
Verse
హోసన్నా - హోసన్నా - హోసన్నా
యోధులమై సాగిపోదము