Chorus
యుద్ధము యెహోవాదే‖ 4x ‖
Verse
రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు‖ 2x ‖
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ‖ యుద్ధము ‖
Verse
వ్యాధులు మనలను పడద్రోసినా
బాధలు మనలను కృంగదీసినా‖ 2x ‖
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ‖ యుద్ధము ‖
Verse
ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా‖ 2x ‖
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా‖ యుద్ధము ‖
Verse
అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా‖ 2x ‖
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ‖ యుద్ధము ‖