Verse 1
యుగముల పర్వంతము స్తొత్రములకర్హుడు
జగములనేలుచున్న జనతైక కుమారుడు
Verse
ఆప్తుడు దేదీప్యుడు ఆపదలో సహాయుడు
నుత్యుడు సత్యుడు సృష్టికి ఆధారుడు నా యేసుడు
Verse
నిరతము నా దుర్గము నాదు రక్షణ కేడెము
కునుకడు నిద్రించడు ఎన్నడు ఎడబాయడు నా యేసుడు
Verse
అల్ఫయు ఓమేగయు అద్యంత రహితుడు
కరుణామయుడు కమనీయుడు కలువరినాధుడు నా యేసుడు